: చిన్నారుల కోసం ఓ 'ఫేస్ బుక్'!


ఫేస్ బుక్, ట్విట్టర్, ఆర్కుట్.. వీటిని చిన్నారులకు సురక్షితమైన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లుగా భావించలేం. మరి చిన్నారులు ఆన్ లైన్ లో ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా విహరించాలంటే ఎలా? అందుకోసమే వచ్చేసింది worldoo.Com సైట్. ఇది ప్రత్యేకంగా భారతీయ చిన్నారులను ఉద్దేశించి రూపొందించిందే. 6 నుంచి 12 ఏళ్లలోపు వారికట. ఎలాంటి అసభ్యకరమైన మాటలు, వేధింపులకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామని సైట్ హెడ్ హర్షవర్ధన్ దవే చెప్పారు. చిన్నారులు చేసే చాట్స్, వారి చర్యలను అనుక్షణం పరిశీలిస్తూ ఉంటారట. వ్యక్తిగత సమాచారం, టెలిఫోన్ నంబర్లు, చిరునామాలు, ఫొటోలు మార్పిడి చేసుకోవడం కూడా నిషేధం. అలా చేస్తే సైట్ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని హర్షవర్దన్ తెలిపారు.

  • Loading...

More Telugu News