: అసోంలో ఆందోళనకారులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలపడంతో అసోంలో మొదలైన ప్రత్యేక బోడోలాండ్ ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఐదు రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. రైలు సర్వీసులు నిలిచిపోయాయి. రాష్ట్రాన్ని విభజించే ప్రశ్నే లేదని సీఎం తరుణ్ గగోయ్ స్పష్టం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులను హెచ్చరించారు. తాజా పరిస్థితిపై తరుణ్ నిన్న ప్రధాని మన్మోహన్ తోనూ చర్చించారు. అయినా, సరే ఆందోళనలు ఉపశమించలేదు. ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కర్బి జిల్లాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు పశ్చిమబెంగాల్లో ప్రత్యేక గుర్ఖాల్యాండ్ ఉద్యమం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. బంద్ నివవధికంగా నడుస్తోంది. దీంతో ప్రజాజీవనం స్తంభించిపోయింది.

  • Loading...

More Telugu News