: యూట్యూబ్ లో పవన్ కల్యాణ్ పాట స్వైరవిహారం


పవన్ కల్యాణ్ పవరేంటో మరోసారి రుజువైంది. 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఆయన సరదాగా పాడిన పాట యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. సైట్లో పెట్టిన కాసేపటికే 3 వేల లైక్స్ తో దూసుకెళ్ళడం పవన్ స్టామినా చాటుతోంది. కాటంరాయుడా కదిరి నరసింహుడా అంటూ సాగే జానపద తరహా గీతం అభిమానులను తప్పక ఆకట్టుకుంటుందని సినీ పండితులంటున్నారు. కాగా, పవర్ స్టార్ ఈ పాటను పాడే సమయంలో తీసిన వీడియోనే యూట్యూబ్ లో ఉంచారు. దాంట్లో, పవన్ పాటలో లీనమైపోయి, ఉత్సాహంతో స్టెప్పులు వేస్తూ రికార్డింగ్ స్టూడియోలో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్, నిర్మాత ప్రసాద్ లను నవ్వుల్లో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News