: తోబుట్టువులను రక్షించబోయి కామాంధుల చేతిలో హతం


పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అత్యాచారానికి అడ్డొచ్చాడని ఓ యువకుడిని సాయుధులు కాల్చిపారేశారు. బుర్ద్వాన్ జిల్లా దైన్ హాట్ లోని నసీపూర్ ఆదివాసి ప్రాంతంలో ఈ ఉదయం నలుగురు యువకులు బలవంతంగా ఒక ఇంట్లోకి చొరబడ్డారు. ఇద్దరు యువతులపై అత్యాచారం చేసే ప్రయత్నం చేయగా.. వారి సోదరుడు గణేశ్ ముర్ము కేకలు వేస్తూ అడ్డుకున్నాడు. దీంతో వారు గణేశ్ ను కాల్చి చంపి పారిపోయారు. నిందితుల కోసం గాలిస్తున్నామని బుర్ద్వాన్ జిల్లా ఎస్పీ మీర్జా మీడియాకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News