: భారత క్రికెటర్ల చిట్కాల కోసం జింబాబ్వే ఆటగాళ్ల క్యూ!


ఏ కోచ్ కూడా తీసుకోనటువంటి వెరైటీ నిర్ణయాన్ని జింబాబ్వే క్రికెట్ కోచ్ ఆండీ వాలర్ తీసుకోవడమే కాకుండా ఆచరణలో పెట్టేశాడు. జింబాబ్వే గడ్డపై జరిగిన 5 వన్డేల సిరీస్ ను 5-0తో భారత్ క్లీన్ స్వీప్ చేయడంతో.. 'వెళ్లి పాఠాలు నేర్వండి' అంటూ ఆండీ, జింబాబ్వే ఆటగాళ్లను భారత క్రికెటర్ల చేంజింగ్ రూమ్ కు పంపాడు.

ఐదో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆండీ మీడియాతో మాట్లాడుతూ వాళ్లు(జింబాబ్వే ఆటగాళ్లు) చేంజింగ్ రూమ్(భారత్) లో ఉన్నారని వెల్లడించారు. ప్రపంచంలో ప్రముఖ ప్లేయర్ల నుంచి నేర్చుకునే అవకాశం ఇప్పడు చేంజింగ్ రూమ్ లో ఉందంటూ వ్యాఖ్యానించాడు. అందరి ముందూ నేర్చుకోవడానికి తమ ఆటగాళ్లు సిగ్గుపడుతున్నారని, చేంజింగ్ రూమ్ లో ఎంతో కొంత నేర్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కెప్టెన్సీ, నాయకత్వం రెండింటిలోనూ కోహ్లీ ప్రతిభను ఆండీ మెచ్చుకున్నాడు. షాట్ల కోసం రిస్కు తీసుకోడని, మంచిగా సాధారణ క్రికెట్ ను ఆడతాడని పేర్కొన్నాడు. భారత క్రికెటర్లను చూసి జింబాబ్వే ఆటగాళ్లు ఎంతో మెరుగుపరచుకోవాల్సి ఉందని ఆండీ ముగించాడు.

  • Loading...

More Telugu News