: మెగా సినిమాలకు విభజన సెగ


మెగా ఫ్యామిలీ సినిమాలకు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తాకనుంది. పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' ఈ నెల 9న విడుదల కానుండగా, 21 రామ్ చరణ్ 'ఎవడు' రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రి చిరంజీవి మద్దతు పలికారని.. అందుకే, మెగా సినిమాలను తాము అడ్డుకుంటామని ఏయూ విద్యార్థి నేతలు హెచ్చరించారు. ఆమరణ దీక్ష చేస్తున్న నేత మహేశ్ మాట్లాడుతూ, ఆంధ్ర ప్రాంతంలో ఈ సినిమాలను ఏ థియేటర్లో ప్రదర్శించినా తమ ఆగ్రహానికి గురికాకతప్పదని కటువుగా వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిరంజీవి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News