: సోనియా, దిగ్విజయ్ లకు 'దశదిన కర్మ'


తెలుగుజాతిని రెండు ముక్కలు చేశారంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నమ్మిన బంటు దిగ్విజయ్ సింగ్ లపై సీమాంధ్ర ప్రజలు కారాలుమిరియాలు నూరుతున్నారు. వారిద్దరూ రాష్ట్ర విభజన తగిలి చనిపోయారని, వారికి దశదిన కర్మ చేస్తామని అంటున్నారు అనంతపురం జిల్లా తనకల్లు వాసులు. ఈ మేరకు ఓ ఆహ్వాన పత్రికను కూడా ముద్రించారు. సమైక్యాంధ్ర ఎఫెక్ట్ తో సోనియా, దిగ్విజయ్ స్వర్గస్తులయ్యారని, వారి పెద్దకర్మకు అందరూ రావాలని సదరు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఈ నెల 30న వైకుంఠసమారాధాన ఉంటుందని ఆ పత్రికలో తెలిపారు.

  • Loading...

More Telugu News