: రసూల్ ను ఆడించకపోవడం దురదృష్టకరమే: కోహ్లీ


కాశ్మీరీ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ కు జింబాబ్వే టూర్ లో ఒక్క వన్డేలోనూ ఆడే అవకాశం కల్పించకపోవడం పట్ల వస్తున్న విమర్శలకు కోహ్లీ స్పందించాడు. రసూల్ ను ఆడించకపోవడం దురదృష్టకరమేనన్నాడు. కానీ, తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. రసూల్ జింబాబ్వే టూర్ కు ఎంపికైనప్పటికీ.. ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం లభించలేదు. అతడు ఇంతవరకు అంతర్జాతీయ మ్యాచ్ లలో అరంగేట్రం చేయలేదు. అదే జరిగి ఉంటే భారత జట్టు తరుపున ఆడిన తొలి కాశ్మీరీ క్రికెటర్ గా చరిత్ర సృష్టించి ఉండేవాడు. రసూల్ కు అవకాశం కల్పించకపోవడం దారుణమని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News