: షూ సాక్స్ లో కేజీ బంగారం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కేరళకు చెందిన సిరాజ్ దుబాయి నుంచి కేజీ బంగారాన్ని తన షూ సాక్స్ లోపల దాచిపెట్టి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. తనిఖీలో బయటపడింది. ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.