: సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో నేడు కూడా బంద్, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రాజమండ్రిలో న్యాయవాదుల రిలే దీక్షలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. డీలక్స్ సెంటర్ లో యువకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అనంతపురం పట్టణంలో వరుసగా ఐదోరోజు బంద్ కొనసాగుతోంది. బస్సులన్నీ నిలిచిపోయాయి. అటు చిత్తూరులోనూ ఐదోరోజు బంద్ జరుగుతోంది. ఎమ్మెల్యే సీకే బాబు చేపట్టిన దీక్షకు మంచి మద్దతు లభిస్తోంది. సీకే బాబు ఈ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. కడపలో ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి చేపట్టిన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది. గుంటూరులో బంద్ నిర్వహిస్తున్నారు. ఏలూరులో జూట్ మిల్లు ఎదుట రాజకీయ నేతలు, కార్మికులు ధర్నా నిర్వహించారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. గాజువాక సెంటర్ లో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు.

  • Loading...

More Telugu News