: రోదసిలోకి తొలి మాట్లాడే రోబో
ప్రపంచంలో మాట్లాడే రోబోను మొట్టమొదటిసారిగా రోదసిలోకి పంపిన ఘనతను జపాన్ సొంతం చేసుకుంది. తమ దేశపు ఆస్ట్రోనాట్ కోచి వకాటా కు సహచరుడిగా ఉండేందుకు ఈ రోబోను జపాన్ రోదసిలోకి పంపుతోంది.
ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)లోని సిబ్బంది అవసరాలు ఉండే వాటిని తీసుకెళ్లేందుకు వెళ్లిన ఒక రాకెట్లోనే దీనిని కూడా పంపించారు. 13 అంగుళాల పొడవు ఉండే ఈ కిరోబో అనే మాట్లాడే రోబో ఆగస్టు 9వ తేదీన ఐఎస్ఎస్పై ల్యాండ్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సుదీర్ఘకాలం ఉండే ఆస్ట్రోనాట్లకు భావోద్వేగాల పరంగా సహకరించడానికి యంత్రాలు ఎలా ఉపకరిస్తాయో అధ్యయనం చేయడానికి ఈ రోబోను ప్రయోగాత్మకంగా పంపుతున్నారు.