: చైనాలో ఇక రెండో బిడ్డను కనొచ్చు


ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న జనాభా సమస్యను దృష్టిలో పెట్టుకుని.. కుటుంబానికి ఒక్కబిడ్డ మాత్రమే అనే నిబంధనను పాటిస్తున్న చైనా.. రెండో బిడ్డను కనడానికి ప్రత్యేకంగా నిబంధనల్లో మార్పు చేర్పులు చేస్తోంది. దంపతులు ఇద్దరూ 'ఒకబిడ్డ' కుటుంబం నుంచి వచ్చిన వారు అయితే గనుక.. వారు రెండోబిడ్డను కూడా కనవచ్చు. అక్కడి కుటుంబ నియంత్రణ అధికారి మావో క్వినాన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

చైనాలో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా.. అదే సమయంలో యువకులు, పిల్లల సంఖ్య తగ్గుతోంది. గత ఏడాది ఓ సర్వే చేస్తే చైనాలో 13 శాతం మంది అంటే 18.5 కోట్ల మంది ... 60 ఏళ్లు దాటిన వృద్ధులే ఉన్నారట. 2015 నాటికి ఈ వృద్ధులు 22 కోట్ల అంకె దాటుతారనేది ఆ దేశం భయం. ఇప్పుడు కుటుంబ నియంత్రణ విషయంలో అక్కడ నిబంధనలు సడలిస్తున్నారు. ఒక్కబిడ్డ కుటుంబాలనుంచి వచ్చిన దంపతులు రెండో బిడ్డను కనడానికి అనుమతిస్తున్నారు.

  • Loading...

More Telugu News