: దిగ్విజయ్ సింగ్ తో చిరంజీవి భేటి
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో కేంద్రమంత్రి చిరంజీవి, సి. రామచంద్రయ్య భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను దిగ్విజయ్ కు ఆయన వివరించారు. హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరినట్టు సమాచారం. రాష్ట్ర ప్రజల తరపున పోరాడేందుకే పదవిలో కొనసాగుతున్నట్టు తెలిపారు.