: భద్రాద్రి రాముడు తెలంగాణవాడే: మంత్రి రాంరెడ్డి
మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి భద్రాద్రి రాముడికి సైతం ప్రాంతీయతను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. భద్రాచలంలో పరివేష్టితుడైన సీతారాముడు తెలంగాణ వాడేనంటున్నారు. భద్రాచలం డివిజన్ ను ఆంధ్రలో కలపాలన్న ప్రతిపాదనలను కొట్టిపారేశారు. ఖమ్మం జిల్లా పాలేరులో మీడియాతో మాట్లాడుతూ, భద్రాచలాన్ని వేరుచేయొద్దని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశానని వెల్లడించారు. జిల్లాలోని 46 మండలాలు తెలంగాణలోనే ఉన్నాయని మంత్రి వివరించారు. రాముడి కరుణాకటాక్షాలకు పాత్రుడైన ప్రియభక్తుడు రామదాసు జన్మస్థలం నేలకొండపల్లి అని, అది పాలేరు నియోజకవర్గ పరిధిలోకే వస్తుందని ఆయన వెల్లడించారు.