: ఆదుకున్న పీటర్సన్


ఆసీస్ తో మూడో యాషెస్ టెస్టులో 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ (73బ్యాటింగ్) ఆదుకున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ను 527/7 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. బదులుగా ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించి కష్టాల్లో పడింది. కెప్టెన్ కుక్ ఓపెనర్ గా బరిలో దిగి 62 పరుగులు చేసినా, ఆసీస్ పేసర్ సిడిల్ చెలరేగి రూట్ (8), బ్రేస్నన్ (1)లను స్వల్ప స్కోర్లకు తిప్పి పంపాడు. ట్రాట్ (5) ను హారిస్ అవుట్ చేయడంతో జట్టును ఆదుకునే భారం పీటర్సన్, బెల్ (40 బ్యాటింగ్) లపై పడింది. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 85 పరుగులు జోడించారు. దీంతో, ఇంగ్లండ్ మూడో రోజు ఆటలో డ్రింక్స్ విరామానికి 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News