: తెలంగాణ ఏర్పాటుపై సెలబ్రిటీల మాట


ప్రత్యేక తెలంగాణపై బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన తారలు, దర్శకులు, క్రీడాకారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొంతమంది తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తే, మరొకరు రాజకీయ లబ్దికోసం రాష్ట్ర విభజనను చేశారన్నారు. వీరంతా హైదరాబాదుతో తమకు ఉన్న అనుబంధాన్ని, నగరంలో తమ గత అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ముందుగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శ్యాం బెనగల్ మాట్లాడుతూ.. 'తెలంగాణ పట్ల నేను చాలా సెంటిమెంటుతో ఉన్నాను. కొన్నిరోజులు నేను తెలంగాణలోనే పెరిగాను. ఇక్కడే నా చిత్రం 'మండి' (1983) తీశాను. ఆంధ్రాలో ఉన్నంతగా తెలంగాణలో వనరులు లేవు. రెండు రాష్ట్రాలకు రాజధానిగా హైదరాబాదు ఉండటం కుదరదు' అని తెలిపారు.

ఇక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మాట్టాడుతూ.. ఓ క్రీడాకారిణిగా ఇది (విభజన) నాకు అంత బాధపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే నేను భారతీయురాలిని, ఎల్లప్పుడూ దేశ ప్రతిష్ఠ కోసమే నేను ఆడతాను. కాబట్టి, ఎప్పుడూ నాకు ఆంధ్రప్రదేశే గుర్తుకొస్తుంది. ఏదేమైనా ఈ నిర్ణయం చారిత్రకంగా నిలిచిపోతుంది. బాలీవుడ్ నటి అదితి రావ్ విషయానికొస్తే.. ఈమె పుట్టింది హైదరాబాదులోనే. కొంతకాలం తర్వాత ముంబయి వెళ్లి అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తోంది. 'దశాబ్దాల పోరాటం తర్వాత ప్రజలకు రాష్ట్రం ఏర్పాడింది. ఈ ప్రాంత ప్రజలు బలంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్ధికంగా తమదని భావిస్తున్నారు' అని తెలిపింది అదితి.

ఇక నటి, మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ షెర్లిన్ చోప్రా కూడా తన ఆలోచనలు పంచుకుంది. తెలంగాణకు మళ్లీ గుర్తింపు అవసరమని తాను భావించడంలేదని చెప్పింది. కొన్ని వందల, వేలకోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధికి అవసరం అవుతాయని తెలిపింది. జీవితం యొక్క ప్రాముఖ్యత మారిపోయిందంటూ, తనకు తెలిసిన దాని ప్రకారం తమ రాజకీయ ప్రయోజనాల కోసం 29వ రాష్ట్రంగా తెలంగాణను స్వాగతించారని తెలుస్తోందన్నారు. హఠాత్తుగా వచ్చే ఏ మార్పు అయినా చాలా బాధాకరంగా ఉంటుందని దర్శకుడు మహేష్ భట్ వివరించాడు.

  • Loading...

More Telugu News