: కేసీఆర్ పై విశాఖలో మళ్లీ కేసు


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వైజాగ్ లో మళ్లీ కేసు నమోదైంది. కేసీఆర్ పై విశాఖపట్టణం టూటౌన్ పోలీస్ స్టేషన్లో సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ ఫిర్యాదు చేసింది. సీమాంధ్ర ఉద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ను అరెస్టు చేయాలని జేఏసీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా సీమాంధ్రులపై చేసిన వ్యాఖ్యలపై కూడా కేసు నమోదైంది. కోర్టులో జేఏసీ ప్రతినిధులు పిటిషన్ కూడా దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News