: హైదరాబాద్ మా అబ్బ సొత్తు: లగడపాటి
హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు అని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించగా, లగడపాటి తాజా సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా మరోసారి బదులిచ్చారు. 'హైదరాబాద్ మా అబ్బసొత్తు' అని సీమాంధ్రులందరి తరుపున దీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేశారు. విజయవాడలో నేడు ప్రజలనుద్ధేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అందరిదీ అని వ్యాఖ్యానించారు. తెలుగుతల్లిని ప్రాణత్యాగాలు చేసైనా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రతులను వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో పంచుతామని లగడపాటి తెలిపారు.