: సంగీత సామ్రాట్టు దక్షిణామూర్తి కన్నుమూత
దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న సంగీత దర్శకుడు వి. దక్షిణామూర్తి (94) గతరాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు ఎలాంటి అనారోగ్యంలేదని, వయసు పైబడిన కారణంగానే మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈయన దాదాపు 850 సినిమాలకు స్వరాలు సమకూర్చారు. 1951లో జీవిదనౌక అనే మలయాళ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరక్టర్ గా ప్రస్థానం ఆరంభించారు. ప్రఖ్యాత గాయకుడు కేజే ఏసుదాసును తీర్చిదిద్దింది దక్షిణామూర్తిగారే. కర్నాటక సంగీతంలో గొప్ప అభినివేశం ఉండడంతో, ఆ ప్రభావం ఆయన స్వరపరిచిన పాటల్లో ప్రస్ఫుటమయ్యేది. పి.సుశీల, లీల వంటి నేపథ్య గాయనీమణుల కెరీర్ కు దక్షిణామూర్తే సోపానాలు వేశారు. వారి కెరీర్ ఆరంభంలో పలు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు.