: సీమాంధ్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించలేను: చిరంజీవి


సీమాంధ్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించలేనని కేంద్ర పర్యటక శాఖా మంత్రి చిరంజీవి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి తన రాజీనామా ఉపయోగపడుతుందంటే రాజీనామా చేసేందుకు తాను సిద్ధమేనని ఆయన తెలిపారు. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని లేక ఉమ్మడి రాజధానిగా లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని తాను అధిష్ఠానానికి తెలిపానని, మళ్లీ అడగడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. తాను చేసిన ప్రతిపాదనల్లో ఏ ఒక్కదానికి అధిష్ఠానం అంగీకరించినా సీమాంధ్ర ప్రజల ఆవేశం తగ్గే అవకాశముందని అన్నారు. అలాగే ఉద్యోగులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

తెలంగాణ ఏర్పడుతున్న ఈ దశలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇరు ప్రాంతప్రజల మధ్య విద్వేషాన్ని రగిల్చే ప్రమాదముందన్నారు. కేసీఆర్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని మనవి చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన రాజకీయ మనుగడకు చేస్తున్న వ్యాఖ్యలుగా భావించాల్సి వస్తుందని చిరు తెలిపారు. సీమాంధ్రలో ఉద్యమం చేస్తున్న ప్రజలు హింసవేపు మరలకుండా సంయమనం పాటించాలని సూచించారు. తాను సమైక్యవాదినేనని, కానీ పార్టీని విలీనం చేయడం వల్ల, తమ పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి వస్తోందని కేంద్ర మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News