: సీఎంతో భేటీకి వస్తున్న సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు
సీఎం, పీసీసీ చీఫ్ తో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఈ సాయంత్రం జరుగనున్న భేటీ కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన ప్రకటన తదనంతర పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు రామచంద్ర కుంతియా, తిరునావుక్కరసు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలోని చర్చను అనుసరించి మరింతమంది తమ భవిష్యత్ ప్రణాళికలు రచించుకోనున్నారని సమాచారం. కేంద్రం నిర్ణయానికి మద్దతు పలకాల్సిందిగా ఎఐసీసీ దూతలు రాజీ మంత్రం పఠిస్తుండగా తమ ప్రాంతంలో ప్రజాగ్రహం చూడాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు వాదనలు విన్పిస్తున్నట్టు సమాచారం.