: కూతురి ప్రేమకు విలన్ గా మారిన దర్శకుడు


సినిమాల్లో ప్రేమను, ప్రేమ వివాహాలను సమర్థించే దర్శకులు నిజజీవితంలో ఒప్పుకునేందుకు సమ్మతించడం లేదు. తమ కుటుంబీకుల ప్రేమ పట్ల వాళ్ళే విలన్లుగా అవతరిస్తున్నారు. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు చేరన్ తన కూమార్తె దామిని ప్రేమ విషయంలో ప్రతినాయకుడిగా మారాడు. ఇరవై సంవత్సరాల దామిని చెన్నైలోని నుంగంబాక్కం కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగులో మూడో సంవత్సరం చదువుతుంది.

కొద్దికాలంగా చంద్రశేఖరన్(25)అనే కోలివుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమిస్తోంది. వారి ప్రేమ వ్యవహారం తండ్రి చేరన్ కు తెలియడంతో వ్యతిరేకత వ్యక్తం చేశాడు. దాంతో, దామిని తన ప్రేమికుడు చంద్రశేఖరన్ కుటుంబంతో కలిసి ఉంటోంది. అప్పటినుంచి తన తండ్రి తనను, చంద్రశేఖర్ ను బెదిరిస్తున్నాడని, రక్షణ కావాలంటూ దామిని చెన్నై పోలీసు కమిషనర్ ను కోరింది. ఈ విషయాన్ని ఆమె మీడియాకు కూడా తెలిపింది.

  • Loading...

More Telugu News