: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 5 నుంచి 30 వరకు


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ను పార్లమెంటరీ శాఖ వ్యవహారాల శాఖా మంత్రి కమల్ నాథ్ ప్రకటించారు. ఈ నెల 5 నుంచి 30 వరకు సమావేశాలు జరగనున్నట్టు తెలిపారు. అవసరమైతే సమావేశాల గడువు పొడిగించే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో సీమాంధ్రలో ఉద్యమాలు ఎరుపెక్కుతున్నాయి. ప్రజల ఆందోళనల స్థాయి తగ్గించాలంటే విభజన ప్రక్రియ ప్రారంభమైందనే సంకేతాలు వారిలోకి పంపాలని, అప్పుడు వారు శాంతించే అవకాశం ఉందనేది కేంద్ర ప్రభుత్వ భావన. దీంతోపాటు ఆహారభద్రత బిల్లు ఆమోదం తొందరగా పొందితే, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రులు రాజీనామాలు చేసినా పెద్దనష్టం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతోనే సెప్టెంబర్ అక్టోబర్ లో జరగాల్సిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హడావుడిగా ప్రకటించినట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News