: యాభై సంవత్సరాల తర్వాత ఆస్కార్ బరిలో పాక్


ప్రపంచవ్యాప్తంగా సినిమా కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఆస్కార్ అవార్డు ఓ కల. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్, ఆస్కార్ నామినేషన్లకు ఓ సినిమాను పంపాలని నిర్ణయించింది. అయితే, అత్యుత్తమ చిత్రాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. 1956లో ఆస్కార్ అవార్డుల్లో విదేశీ చిత్ర విభాగం ప్రవేశపెట్టిన తర్వాత పాకిస్తాన్ ఇప్పటివరకు రెండు చిత్రాలనే పంపింది. తాజాగా, పాక్ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ కు దరఖాస్తు చేయనుంది. దరఖాస్తులు పంపేందుకు అక్టోబర్ ఒకటి చివరి తేదీ. ఈ ఏడాది పాక్ లో మొత్తం 21 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలోనుంచి కొన్నింటిని ఎంపికచేసి పంపనుంది. గతంలో 1959, 63లో పాకిస్తాన్ రెండు చిత్రాలను పంపింది.

  • Loading...

More Telugu News