: ఆహార భద్రత చట్టానికి సవరణలు సూచించిన తమిళనాడు సీఎం


వివాదాస్పద ఆహార భద్రత చట్టానికి సవరణలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిమాండు చేశారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన జయ ఐదు సవరణలు సూచించారు. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నారు. ఆహార చట్టం కింద పట్టణ జనాభా నిష్పత్తిని 50 శాతానికి పెంచాలని, దీనివల్ల దాదాపు పట్ణణ ప్రజలంతా లబ్ది పొందుతారన్నారు. కాగా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద అమలుచేస్తున్న ఆహార ధాన్యాల కేటాయింపు తగినంత ఉండాలని కోరారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు తగిన సవరణలు చేశాకే బిల్లును తీసుకురావాలని జయ లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News