: కేసీఆర్... నీ మూలాలు మర్చిపోవద్దు: శైలజానాథ్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మూలాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయన్న విషయాన్ని మరువొద్దని మంత్రి శైలజానాథ్ సూచించారు. సీఎల్పీలో ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల రక్షణకు రాష్ట్రం సమైక్యంగా ఉండడమే పరిష్కారం అన్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రులను ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసన్నారు శైలజానాథ్. బీజేపీ, సీపీఐ, టీడీపీలు రాష్ట్రాన్ని చీల్చాలనే చెబుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి చరిత్ర హీనులుగా నిలవాలని తాము కోరుకోవడంలేదని శైలజానాథ్ అన్నారు.