: ప్రజలతో కలిసి పోరాడేందుకే రాజీనామా చేశా:టీజీ
తాను ఎప్పుడూ సమైక్యవాదినేనని, ప్రజలతో కలిసి పోరాడేందుకే రాజీనామా చేశానని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ నికర జలాలను తెలంగాణ వారు ఉంచుకుని, వరద నీటిని సీమకు ఇవ్వడం అన్యాయమన్నారు. రాయలసీమ గురించి పట్టించుకునే నాయకులు తెలంగాణ, కోస్తాలోనే కాదు, రాయలసీమలో కూడా లేరన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆజ్యం పోసిన వారి విగ్రహాలను వదిలేసి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తపించిన నేతల విగ్రహాలు కూల్చడం సరి కాదన్నారు. జనంతో కలిసి సమైక్య పోరాటంలో పాల్గొంటానని టీజీ హామీ ఇచ్చారు.