: విలీనం తప్పించుకునేందుకే కేసీఆర్ వ్యాఖ్యలు: హర్షకుమార్
సీమాంధ్ర ఉద్యోగులు వెళ్ళిపోవాల్సిందేనంటూ కేసీఆర్ హుంకరించడం.. కాంగ్రెస్ పార్టీలో విలీనం తప్పించుకునే ఎత్తుగడల్లో భాగమేనని అమలాపురం ఎంపీ హర్షకుమార్ అంటున్నారు. రాజమండ్రిలో నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ఉద్యోగులను వెళ్ళగొట్టడం కేసీఆర్ తరం కాదని హెచ్చరించారు. హైదరాబాదుపై మూడు ప్రాంతాల ప్రజలకూ సమాన హక్కు ఉంటుందని హర్షకుమార్ స్పష్టం చేశారు.