: విభజన ఇష్టంలేకే కేసీఆర్ వ్యాఖ్యలు: సోమిరెడ్డి


తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కు అసలు రాష్ట్ర విభజన ఇష్టంలేదని, అందుకే, కడుపుమంటతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు. హైదరాబాదులో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ మాటలు తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజల్లో అభద్రతభావం పెంపొందేలా ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగ్విజయ్ సింగ్ సమాధానమివ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ అరాచకాల బారిన పడకుండా ప్రజలకు తాము రక్షణ కల్పిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News