: ఉప్పునూతల మృతికి సీఎం సంతాపం
మాజీమంత్రి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి మృతికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. హైదరాబాదులోని ఆయన భౌతికకాయం వద్ద కిరణ్ నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.