: నేపాల్ సరిహద్దుల్లో సీతారామ, లక్ష్మణ విగ్రహాల పట్టివేత


విలువైన అష్ట ధాతు సీతారామ, లక్ష్మణ విగ్రహాలను అక్రమంగా నేపాల్ కు తరలిస్తుండగా.. బీహార్లో పోలీసులు పట్టుకున్నారు. ఆరు విగ్రహాలను ఆటోలో నేపాల్ వైపు తరలిస్తుండగా.. అరారియా జిల్లాలోని, బత్నహ ఔట్ పోస్ట్ వద్ద ఎస్ఎస్ బీ పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. ఆరు అష్ట ధాతు విగ్రహాలు బయటపడ్డాయి. అందులో సీతారామ, లక్ష్మణుల విగ్రహాలు ఉన్నట్లు ఎస్ఎస్ బీ కమాండెంట్ మహేశ్వర్ ప్రసాద్ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి విచారించగా.. నేపాల్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ విగ్రహాల విలువ కోట్ల రూపాయలలో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News