: హైదరాబాదుపై చిరంజీవి స్పందన


రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి చిరంజీవి నోరు విప్పారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగడంపై మాట్లాడిన ఆయన, ఛండీగఢ్ లా రెండు రాష్ట్రాలకు 'హైదరాబాదు శాశ్వత ఉమ్మడి రాజధాని'గా ఉండాలన్న ప్రతిపాదన చేస్తానన్నారు. అధిష్ఠానం బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో దీన్ని ఒక పాయింటుగా చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. సీమాంధ్ర ప్రజలకు ఎలా న్యాయం చేకూరాలో, ఏ రకంగా లబ్ది చేకూరాలో, వారి అభివృద్ధికి ఎలా దోహదపడతాయో ఆ దిశగా కచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాగా, ఎప్పటినుంచో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు ఛండీగఢ్ ఉమ్మడి రాజధాని కొనసాగుతోంది. 1966 తీర్మానం సందర్భంగా చండీగఢ్ పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని పేర్కొన్నా.. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగానే కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News