: చిరంజీవీ.. ప్రజలతో ఆడుకోవద్దు: సబ్బంహరి
విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సబ్బం హరి కేంద్రమంత్రి చిరంజీవిపై మండిపడ్డారు. విభజనకు నిరసనగా ప్రజలంతా ఉద్యమం చేస్తుంటే, తన మాటల ద్వారా చిరంజీవి రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలతో ఆడుకోవద్దని హితవు పలికారు. రాష్ట్ర్రాన్ని ఏకపక్షంగా విభజించిన కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఎందుకు ఏర్పాటుచేసిందని సబ్బం ప్రశ్నించారు. తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశానని, నిన్న సాయంత్రమే లేఖను సభాపతికి పంపినట్లు తెలిపారు. రెండుమూడు రోజుల్లో ప్రత్యక్ష ఆందోళనల్లో తాను పాల్గొంటానన్నారు.