: బీహార్లో రైల్వే ట్రాక్ ను పేల్చేసిన మావోయిస్టులు


బీహార్లో మావోయిస్టులు మరోసారి చెలరేగిపోయారు. గయ సమీపంలో.. తరాయ, గురారు రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ ను బాంబులతో పేల్చేశారు. గత రాత్రి 11 గంటల సమయంలో ఇది జరిగింది. దీంతో, మూడు రాజధాని రైళ్లు సహా ఆ మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్లు నిలిచిపోయాయి. దాడివల్ల మూడు అడుగుల మేర ట్రాక్ దెబ్బతిందని గయ రైల్వే డీఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు. దాడికి 20 నిమిషాల ముందే హౌరా-ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ ఆ మార్గంలో వెళ్లిందని చెప్పారు.

  • Loading...

More Telugu News