: క్లీన్ స్వీప్ పై భారత్ గురి
జింబాబ్వే గడ్డపై భారత జట్టు జైత్రయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ఐదు వన్డేల సిరీస్ లో జరిగిన నాలుగు వన్డేలను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా చివరి వన్డేలోనూ గెలిచి సిరీస్ ను 5-0తో ముగించాలని భావిస్తోంది. మరోవైపు చివరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని జింబాబ్వే జట్టు తహతహలాడుతోంది. ఆఖరి వన్డే బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30 నుంచి జరుగుతుంది.