: ఉప్పొంగిన గోదావరి.. భద్రాద్రి వద్ద భీకరంగా ప్రవాహం


గోదారమ్మ ప్రళయరూపం దాల్చింది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద నీటిమట్టం ఈ ఉదయం 61.7 అడుగులకు చేరుకుని భీకరంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి నీరు వెల్లువలా వస్తుండడంతో నీటిమట్టం ఈ స్థాయికి చేరింది. ఇక్కడ గోదావరి నీటిమట్టం ఈ స్థాయిలో ప్రవహించడం 40 ఏళ్లలో మొదటిసారి. డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కూనవరం, వరదరామచంద్రాపురం మధ్య శబరి వంతెన వరదనీటిలో మునిగిపోయింది. దీంతో, ఆ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరదనీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు పంపాల్సిందిగా జిల్లా అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.

కరకట్ట నుంచి నీరు లీకవడంతో రామాలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. దుకాణాలన్నీ నీట మునిగాయి. మరోవైపు రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా గోదారమ్మ భీకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

  • Loading...

More Telugu News