: స్వదేశం వెళ్లి ఓటేసేందుకు ఇటలీ నావికులకు సుప్రీం అనుమతి


భారత జైలులో ఉన్న ఇద్దరు ఇటలీ నావికులకు వారి స్వదేశంలో జరుగనున్న ఎన్నికల్లో ఓటేసేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. గత ఏడాది కేరళ సముద్ర జలాల్లో ఇద్దరు జాలర్లను కాల్సి చంపిన కేసులో ఇటలీ నౌకా సిబ్బంది మాస్సిమిలియానో లాట్టోరే, సాల్వటోర్ గిరోనే అరెస్టయ్యారు. కాగా, ఇటలీలో ఈ నెల 24, 25 తేదీల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని సుప్రీంకు విన్నవించుకున్నారు.

దీంతో, వీరిరువురు భారత్ లోని ఇటలీ రాయబారి పర్యవేక్షణలో స్వదేశానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని, తిరిగి భారత్ కు రావాలని జస్టిస్ అల్తమాస్ కబీర్ నేతృత్వంలోని ధర్మాసనం తన తీర్పులో వివరించింది. లాట్టోరే, గిరోనే గత ఏడాది ఫిబ్రవరి 15న 'ఎన్రికా లెక్జీ' నౌకలో కేరళ సమీపంలో కొల్లం వద్ద ఇద్దరు జాలర్లను దొంగలుగా పొరబడి కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి వీరిద్దరూ కొల్లం జైల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News