: రూ.12వేల కోట్లు ఛారిటీకి విరాళంగా ఇచ్చిన విప్రో అధినేత


లాభం లేకుండా ఎవరైనా డబ్బును ఉదారంగా ఇస్తారా? అని ఎవరినైనా అడిగితే.. లేదనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ.12, 300 కోట్లను లాభాల కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా ఛారిటీ సంస్థకు తరలించారు విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ. 

ఇందుకోసం విప్రో సంస్థకు చెందిన 12 శాతం షేర్లను తన సారథ్యంలోనే నడిచే అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ కు ఆయన తరలించారు. దీంతో తమ ఆస్తిలో సింహ భాగాన్ని ప్రజా శ్రేయస్సుకి వినియోగించిన వారి జాబితాలో ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ ల తర్వాత అజీమ్ ప్రేమ్ జీ చేరారు. అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్ లతో పాటు ఇతర రాష్ట్రాల్లోని గ్రామాలను అభివృద్ధి చేయనుంది.

  • Loading...

More Telugu News