: ఆసీస్ భారీ స్కోరు


యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు పుంజుకుంది. తొలి రెండు టెస్టుల్లో పేలవ బ్యాటింగ్ తో కుదేలైన కంగారూలు మూడో టెస్టులో పుంజుకున్నారు. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో నిన్న మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మొదటి ఇన్నింగ్స్ లో తొలి రోజు ఆట ముగిసేసమయానికి 3 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసిన ఆసీస్.. రెండో రోజు డ్రింక్స్ విరామానికి 7 వికెట్లు కోల్పోయి 439 పరుగులు చేసింది. కెప్టెన్ క్లార్క్ 187 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. యువ ఆల్ రౌండర్ స్మిత్ (89), ఓపెనర్ రోజర్స్ (84) రాణించారు. ప్రస్తుతం క్రీజులో హాడిన్ (46 బ్యాటింగ్), స్టార్క్ (11 బ్యాటింగ్) ఉన్నారు. కాగా, ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ 5 వికెట్లు తీశాడు. ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ ఇప్పటికే తొలి రెండు టెస్టులను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News