: సీబీఐ వాదనను వ్యతిరేకించిన కేంద్రం
సీబీఐ పట్ల కేంద్రం వైఖరి మరోసారి వెల్లడైంది. సీబీఐ చీఫ్ కు మరిన్ని అధికారాలు కల్పించాలని, అతని పదవీకాలాన్ని మూడేళ్ళపాటు పొడిగించాలన్న సీబీఐ వాదనను నేడు కేంద్రం.. సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. సీబీఐ చీఫ్ కు సర్వాధికారాలు కట్టబెట్టడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని కేంద్రం వాదించింది. ఇక జవాబుదారీ సంఘం అవసరంలేదన్న సీబీఐ వాదననూ కేంద్రం తప్పుబట్టింది. సీనియర్ అధికారులను విచారించేందుకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆధ్వర్యంలో ఓ స్వతంత్ర కమిటీని నియమించాలన్న సీబీఐ వాదన సరికాదని కేంద్రం స్పష్టం చేసింది.