: అవనిగడ్డ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్ధిని నిలబెట్టం: బొత్స
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఏకగ్రీవానికి సంప్రదాయాన్ని పాటించి సహకరిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రతి స్పందించారు. బాబుకు ఓ లేఖ రాశారు. కాంగ్రెస్ అభ్యర్ధిని నిలబెట్టబోమని ఆ లేఖలో స్పష్టం చేశారు. అటు ఇప్పటికే వైఎస్సార్సీపీ కూడా బరినుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. దాంతో, టీడీపీ తరపున పోటీ చేస్తున్న అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరి ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.