: తెలంగాణ ఇచ్చి కేంద్రం గూర్ఖాలాండును కదిలించింది: తృణమూల్


కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసి, అణగారిన గూర్ఖాలాండ్ డిమాండును ఎగదోసినట్టయిందని తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. రాజకీయలబ్ది కోసమే కేంద్ర ప్రభుత్వం ఇలా చేసిందని తృణమూల్ జనరల్ సెక్రటరీ ముకుల్ రాయ్ ఆరోపించారు. ఉత్తర బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రం ఇలా చేయడం అన్యాయం, అనైతికమని వ్యాఖ్యానించారు. అయితే, పశ్చిమ బెంగాల్ నుంచి డార్జిలింగును విడదీసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. డార్జిలింగు బెంగాల్లో ఒక ప్రాంతమని, ఇదే తమ పార్టీ, ప్రభుత్వ నిర్ణయమని రాయ్ స్పష్టం చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండు కావాలంటూ వారం రోజుల నుంచి జరుగుతున్న బందును ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News