: ప్రధానికి జయ లేఖ.. భారత జాలర్ల అరెస్టుపై ఆందోళన


దాదాపు అరవైమంది భారత జాలర్లను శ్రీలంక అరెస్టు చేయడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వారిని విడిపించేలా లంక హై కమిషనర్ తో చర్చలు జరపాలని కోరారు. అరెస్టు పట్ల భారతీయుల నిరసనను తెలపాలని విజ్ఞప్తి చేశారు. జులై 30న నాగపట్నంకు చెందిన ఐదుగురు మత్స్యకారులపై పైపులతో శ్రీలంక నావికులు దాడి చేశారని, తర్వాత మరో 36 మంది మత్స్యకారులను జులై 31న అరెస్టు చేశారని వివరించారు. ఈ ఘటనపై తాను తీవ్రంగా బాధపడుతున్నట్లు చెప్పారు. మత్స్యకారులను అకారణంగా అరెస్టుచేసి వారిపై కేసు నమోదు చేయడం చాలా బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News