: చిరంజీవి కాళ్లూ, చేతులు విరగ్గొడతాం ఖబడ్దార్: శోభారాణి
సోనియా గాంధీ కాళ్ల దగ్గర తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చిరంజీవి కాళ్లూ, చేతులు విరగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నామని అప్పటి ప్రజారాజ్యం పార్టీ మహిళా నేత శోభారాణి హెచ్చరించారు. సినిమాల్లో వేసిన వేషాలే ఇప్పుడూ వేస్తూ చిరంజీవి నటిస్తున్నాడని ధ్వజమెత్తారు. నేతలంతా రాజీనామాలు చేస్తుంటే ఈయన ఎక్కడున్నాడంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో తెలుగువాళ్లు సమైక్యంగా ఉందామంటూ తెగ వేషాలేసిన చిరంజీవి, పార్టీని విలీనం చేసి అమ్ముడుపోయి, పదవిని చేపట్టాడని విరుచుకుపడ్డారు. కొందరు నేతల స్వార్ధం వల్లే రాష్ట్రం విడిపోతోందంటూ ఆమె గృహనిర్భంధం విధించుకున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన సోనియా గాంధీ తక్షణం దేశం విడిచిపోవాలని ఘాటుగా స్పందించారు. రాష్ట్రం అగ్నిగుండమైందని శోభారాణి ఆవేదన వ్యక్తం చేశారు.