: ఆపిల్ కంటే శామ్ సంగే ఉత్తమం!
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దాదాపు ఒకే స్థాయిలో దూసుకుపోతున్న మొబైల్ కంపెనీలు ఆపిల్,శామ్ సంగ్. ఈ రెండింటిలో స్మార్ట్ ఫోన్ల కేటగిరీలో ఆపిల్ వెనకబడిందని ఓ పరిశోధన చెబుతోంది. శామ్ సంగ్ గెలాక్సీ 'ఎస్ త్రి స్మార్ట్ ఫోన్' తోనే ఎక్కువమంది వినియోగదారులు సంతృప్తి చెందుతున్నారని, ఇదే ఉత్తమం అంటున్నారని 'అమెరికన్ కస్టమర్స్ శాటిస్ ఫాక్షన్ ఇండెక్స్' (ఏసిఎస్ఐ) తెలిపింది.
ఎస్ త్రి, గెలాక్సీ నోట్ టు ఈ రెండు మొబైల్స్ వందకు ఎనభై నాలుగు పాయింట్లు సాధించడంతో శామ్ సంగ్ టాప్ ప్లేస్ లో నిలిచింది. కాగా, మొదటి పది స్థానాల్లో ఆపిల్ ఐఫోన్ 5, ఐఫోన్ 4 ఎస్ ఎనభై రెండు పాయింట్లతో మూడు, ఐదు స్థానాల్లో ఉంది. ఇక ఐఫోన్ 4 ఎనభై ఒక్క పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. మొత్తం రాంకుల వారీగా చూస్తే ఆపిల్ 81 పాయింట్లతో శామ్ సంగ్ (76 పాయింట్లు)ను వెనక్కు నెట్టిందని ఏసిఎస్ఐ పరిశోధన వెల్లడించింది.