: రాజీనామాలెందుకు?: పనబాక


తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా బాటపట్టిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వాదన మరోలా ఉంది. రాజీనామాలు చేయడం తొందరపాటు నిర్ణయమే అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. హైదారాబాదులో మీడియాతో మాట్లాడుతూ, నేతలు, ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. హైదరాబాదుపై అందరికీ సెంటిమెంట్ ఉందని అంటూ, ఆ విషయాన్ని అధిష్ఠానానికి వివరిద్దామని అన్నారు. పార్లమెంటు తాజా సమావేశాలకు ఎవరూ అడ్డంకులు సృష్టించబోవద్దని చెప్పారు. ఆ సమావేశాల్లో అభిప్రాయాలను బలంగా వినిపిద్దామని సూచించారు.

  • Loading...

More Telugu News