: దిగ్విజయ్ హామీ ఇచ్చారంటున్న పురందేశ్వరి
రాష్ట్ర విభజన నిరసిస్తూ సీమాంధ్ర నేతలు రాజీనామాల బాట పడుతుండడం పట్ల కేంద్రమంత్రి పురేందశ్వరి స్పందించారు. పార్లమెంటులో తమ గొంతుకు వినిపించే అవకాశం కోల్పోవద్దంటూ దిగ్విజయ్ సింగ్ సూచించారని ఆమె తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం పురందేశ్వరి సహా పలువురు కేంద్ర మంత్రులు దిగ్విజయ్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల బేరీజుకై ఉన్నతస్థాయి కమిటీ వేస్తామని దిగ్విజయ్ హామీ ఇచ్చారని పురందేశ్వరి వెల్లడించారు. మరో మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ, కష్టమైనా, సుఖమైనా అన్ని ప్రాంతాలు పంచుకోగలిగేలా ఉండాలని వ్యాఖ్యానించారు. ఇక, తమ రాజీనామా లేఖలు దిగ్విజయ్ వద్దనే ఉన్నాయని పళ్ళంరాజు అన్నారు.