: సెప్టెంబర్ 11 నుంచి కేదార్ నాథ్ ఆలయంలో పూజలు


ఉత్తరాఖండ్ వరదల కారణంగా కేదార్ నాథ్ ఆలయంలో నిలిచిపోయిన పూజా కార్యక్రమాలను సెప్టెంబర్ 11 నుంచి పునఃప్రారంభించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ప్రకటించారు. సీఎం బహుగుణ, కేదార్ నాథ్ మందిర్ సమితి మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 16,17 తేదీల్లో సంభవించిన వరదల కారణంగా ఆలయంలో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయింది. పూజలు నిర్వహించే సమయానికి ఆలయాన్ని ఉత్తరాఖండ్ సర్కార్ శుభ్రం చేయించనుంది.

  • Loading...

More Telugu News