: వెంకటగిరి ఎమ్మెల్యే బహిరంగ రాజీనామా
రాష్ట్ర విభజనను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కురుగొండ రామకృష్ణ నేడు పదవికి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కురుగొండ ఈ ఉదయం వెంకటగిరిలోని నివాసం నుంచి పోలేరమ్మ ఆలయం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని కాశిపేట కూడలి వద్దకు చేరుకుని ప్రజల సమక్షంలో బహిరంగంగా రాజీనామా ప్రకటన చేశారు.