: విభజనే పరిష్కారం కాదు.. అందుకే రాజీనామాలు చేశాం: ఎంపీ అనంత
స్పీకర్ ఫార్మాట్ లోనే తాము రాజీనామాలు చేశామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఢిల్లీలో రాజీనామాలు సమర్పించిన అనంతరం మాట్లాడుతూ, విభజనే తెలంగాణ అభివృద్ధికి పరిష్కారం కాదని అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నందునే తాము రాజీనామా చేశామని తెలిపారు. మూడు ప్రాంతాల వారిని పిలిచి మాట్లాడకుండా విభజన ఎలా చేస్తారని మండిపడ్డారు.